రోడ్డున పడిన కార్మికులు

ABN , First Publish Date - 2021-10-15T05:24:23+05:30 IST

వేండ్ర డెల్టా పేపర్‌ మిల్‌ మూసివేయడం వల్ల వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయని జేఏసీ నాయకుడు ఎం.సూర్య నారాయణరాజు అన్నారు.

రోడ్డున పడిన కార్మికులు
పాదయాత్ర చేస్తున్న కార్మికులు

రెండో రోజు డెల్టా పేపర్‌ మిల్లు కార్మికుల పాదయాత్ర


పాలకోడేరు, అక్టోబరు 14 : వేండ్ర డెల్టా పేపర్‌ మిల్‌ మూసివేయడం వల్ల వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయని జేఏసీ నాయకుడు ఎం.సూర్య నారాయణరాజు అన్నారు. రెండో రోజు గురువారం పాలకోడేరు గుత్తులవారిపాలెం, మోగల్లు గ్రామాల్లో కార్మికులు పాదయాత్ర చేశారు. రెండు నెలలుగా ఫ్యాక్టరీ మూసివేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులను ఆదు కోవాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ సెక్రటరీ వైఎస్సార్‌ మూర్తి, సీఐటీయూ అధ్యక్షుడు వి.భద్రం మాట్లాడుతూ క్లోజర్‌ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెయ్యి మంది కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. చట్టవిరుద్ధంగా ఫ్యాక్టరీ మూసివేసిన కాలానికి వేత నాలు ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో కె.రంగా రావు, జీవీ.సత్యనారాయణ, వీరమ్మ, పి.అశోక్‌, రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T05:24:23+05:30 IST