జై భవానీ

ABN , First Publish Date - 2021-10-08T05:19:37+05:30 IST

పట్టణంలోని దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

జై భవానీ
భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో దసరా సంబరాలు

శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం


భీమవరంటౌన్‌, అక్టోబరు 7 :  పట్టణంలోని దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.మావుళ్లమ్మ తొలిరోజు గురువారం బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు.ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ కలశస్థాపనతో పూజలు ప్రారంభించారు.ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్‌ పర్యవేక్షించారు. గునుపూడి సోమేశ్వర స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, సత్యరాణి దంపతులు ప్రారంభించారు అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో అరుణ్‌కుమార్‌ పర్యవేక్షించారు. మెంటే వారితోటలోని బాలా త్రిపుర సుందరికి  అర్చకుడు కొమ్ము శ్రీనివాస్‌ గాజులతో అలంకారం చేశారు  భీమేశ్వర స్వామి ఆలయంలో మహిషాసుర మర్ధిని అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా, శ్రీరాంపురంలోని శ్రీచక్రసహిత కనకదుర్గమ్మ స్వర్ణకవచాలాంకృత కనకదుర్గగా భక్తులకు దర్శనం ఇచ్చారు.  


పాలకొల్లు అర్బన్‌ : యడ్లబజారు కనకదుర్గమ్మ, లాకు దిగువ దేశాలమ్మ, షావుకారు పేట మావుళ్ళమ్మ, బంగారు వారి చెరువు గట్టు శ్రీ మా వూరమ్మ, చిత్రాయి చెరువు గట్టు శ్రీముఖదారమ్మ, మావుళ్ళమ్మ పేట శ్రీమావు ళ్ళమ్మ ఆలయాల్లో కుంకుమ పూజలు చేశారు. యడ్లబజారు కనకదుర్గమ్మ ఆలయంలో పాలక మండలి చైర్మన్‌ కావలి శ్రీనివాసరావు, ఈవో ఎన్‌ సతీష్‌ కుమార్‌ పర్యవేక్షించారు. పంచారామ క్షేత్రమైన శ్రీక్షీరా రామలిం గేశ్వరస్వామి ఆలయంలో పార్వతి, లక్ష్మీదేవి అమ్మవార్లకు ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం పార్వతీ దేవిని లలితా దేవిగా అలంకరించారు. ఈవో యాళ్ళ సూర్యనారాయణ, చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. 


మొగల్తూరు : దేవీ శరన్నవరాత్రులు గురువారం తీర గ్రామాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని పలు ఆలయాలతో పాటు కూడళ్లలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల వద్ద భక్తులు పూజలు చేశారు. తొలిరోజు  స్వర్ణకవచాలంకృత అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు. మొగల్తూరు భవానీ కాలనీ కనకదుర్గమ్మ, పార్వతీదేవి ఆలయాల్లో వేకువ జాము నుంచే పూజలు చేశారు. సత్రవుపాలెం, కోట, పడమటిపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం, కూరగాయల మార్కెట్‌, కుక్కలవారితోట, గుంటపల్లవపాలెం, లాకుపల్లవ పా లెం, కొత్తకాయలతిప్ప, మోడి గ్రామాల్లో అమ్మవారిని నిలబెట్టారు. 


కాళ్ళ : మండలంలోని పలు గ్రామాల్లో శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాళ్ళ, కాళ్ళకూరు, కోమటిగుంట, దొడ్డనపూడి, పెదఅమిరం, కోపల్లె, జువ్వలపాలెం, ఏలూరుపాడు తదితర గ్రామాల్లో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మొదటి రోజు అమ్మవారు ఆదిలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, కలశ స్ధాపన, మండపారాధన అర్చకులు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా తాడినాడ గ్రామస్థుడు వేగేశ్న వెంకట సూర్యసత్యనారాయణరాజు(ఏడుకొండల రాజు), సూర్యలక్ష్మీ దంపతులు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు.  


ఆకివీడు : పెద్దింట్లమ్మ, వనువులమ్మ దేవస్థానాల్లో అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య కల్యాణ మందిరం, సాలిపేటలో దేవి భక్తబృందం నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.మాదివాడ, వెలంపేట, శాంతినగర్‌, శ్రీనగర్‌కాలనీ, సంతమార్కెట్‌,పెద్దింట్లమ్మ వీధి గొల్లవీధి, శ్రీరామపురం తదితరచోట్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. 


పాలకోడేరు : దసరా వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకోడేరు, పెన్నాడ, పెన్నాడపాలెం, శృంగవృక్షం, విస్సాకోడేరు, వేండ్ర, గొల్లలకోడేరు తదితర గ్రామాల్లో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.పెన్నాడపాలెంలో కనకదుర్గమ్మకు తొలిరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం అమ్మవారికి పంచామృతా భిషేకం, కలశస్థాపన, మండపారాధన అర్చకులు ఘనంగా నిర్వహించారు. పెన్నాడపాలెం గ్రామస్థులు చేబోలు రామకృష్ణ, వెంకట జయలక్ష్మీ దంపతులచే అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.  


యలమంచిలి : మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. యలమంచిలి, మేడపాడు, దొడ్డిపట్ల, అబ్బి రాజుపాలెం, గుంపర్రు, అడవిపాలెం గ్రామాల్లో కనకదుర్గమ్మవారి ఆలయాల్లో కలశస్థాపనలు చేశారు.గ్రామాల్లోని ప్రధానకూడళ్ల వద్ద అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. పలు ఆలయాల్లో అమ్మవారిని కాత్యాయినిదేవిగా అలంకరించారు. అమ్మవార్లకు కుంకుమార్చనలు చేశారు. 


నరసాపురం టౌన్‌ : తీరంలో గురువారం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాం వద్ద కేదాసు శివ దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు.మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనా యు డు అమ్మవారిని దర్శించుకున్నారు. పుంతలతో ముసలమ్మ ఆలయం వద్ద   ప్రూజలు చేశారు.కొప్పర్రు, ఎల్‌బిచర్ల, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, పసలదీవి, తూర్పుతాళ్ళు, గొంది, చిట్టవరం గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించారు. 


పెనుగొండ : మండలంలో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.వాసవి శాంతి ధామ్‌ పెనుగొండ క్షేత్రంలో గురువారం వాసవీమాత శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 


వీరవాసరం : దేవీ శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభం అయ్యాయి.  వీరవాసరం కనకదుర్గాంబ ఆలయంలో అమ్మవారు తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోటసత్తెమ్మ ఆలయంలో కూనపరెడ్డి తారక సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులు ఉత్సవాలను ప్రారంభిం చారు.రాయకుదురు,అండలూరు,కొణితివాడ,మత్స్యపురి గ్రామాల్లోనూ ఉత్స వాలు ప్రారంభమయ్యాయి. భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


ఆచంట : దసరా ఉత్సవాలు గురువారం వేడుకగా ప్రారంభమయ్యాయి.  ఆచంట శ్రీరామేశ్వరస్వామి, పెదమల్లం మాచేనమ్మ ఆలయాల్లో అమ్మవార్లు మొదటి రోజు పర్వత వర్థిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.   అమ్మవారు పర్వతీవర్ధిని దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. పెదమల్లం ఆల య చైర్మన్‌ నెక్కంటి రామలింగేశ్వరరావు, అధికారులు గుబ్బల రామ పెద్దింట్లు రావు, మామిడిశెట్టి వీర వెంకట శ్రీనివాసరావు, వైట్ల కిషోర్‌, కోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.పలు చోట్ల అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. 


ఉండి : దసరా ఉత్సవాలను ఊరూవాడా ఘనంగా ప్రారంభించారు.  ఉండి సాయిబాబా ఆలయం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉండి సంతమార్కెట్‌, నిమ్మనపేట సెంటర్‌,  సివిల్‌ సప్లయిస్‌ గొడౌన్‌, భవానీపేటలో వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. యండగండి సువర్ణా మల్లేశ్వరి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజ లు  చేశారు. 



Updated Date - 2021-10-08T05:19:37+05:30 IST