ధాన్యం డబ్బులేవి..?

ABN , First Publish Date - 2021-05-21T05:14:38+05:30 IST

గణపవరం మండలానికి చెందిన రైతు సత్య నారాయణ గతనెల 15న కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాడు.

ధాన్యం డబ్బులేవి..?

సకాలంలో చెల్లించని ప్రభుత్వం 

వారాల తరబడి వేచిచూస్తున్న రైతులు

బకాయిల మొత్తం రూ.918 కోట్లు

(తాడేపల్లిగూడెం/ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి) : గణపవరం మండలానికి చెందిన రైతు సత్య నారాయణ గతనెల 15న  కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. దీని నిమిత్తం రెండు లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. 35 రోజులు గడచినా సొమ్ములు అందలేదు. ఓ వైపు అప్పుల వాళ్లు వెంట పడు తున్నారు. పెట్టుబడులకు డబ్బు అవసరం పడటంతో రైతు ఉక్కిరి బిక్కిరి అవుతు న్నాడు. ఇలాంటి పరిస్థితి చాలామంది రైతులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వెలుగు, సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రబీలో 13.98 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు రూ.1,521 కోట్ల విలువైన ఎనిమిది లక్షల 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 67 వేల 500 మంది రైతులు ఈ ధాన్యాన్ని అమ్మగా 28,651 మంది రైతులకు రూ.603 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 38 వేల 849 మంది రైతులకు రూ.918 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో 48 గంటల్లోనే డబ్బులు చేతుల్లో పడేవి. ఇప్పుడు సకాలంలో సొమ్ములు చెల్లించడం లేదు. నమోదైన 15 రోజులకు సొమ్ము జమ చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా నెల గడిచినా రావడం లేదు. ప్రభుత్వం సక్రమంగా సొమ్ములు చెల్లించినంత కాలం వ్యాపా రులు పోటీపడి మరీ మద్దతు ధరకంటే అధికంగా సొమ్ములు చెల్లించి కొనుగోలు చేసేవారు. రవాణా ఛార్జీలను రైతుకే ఇచ్చేవారు. తొలిసారి ఈ ఏడాది మద్దతు ధరలో సైతం దారుణంగా కోత పడుతోంది.నూక శాతం అధికంగా ఉండడం వల్లే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-21T05:14:38+05:30 IST