మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోం

ABN , First Publish Date - 2021-08-22T05:10:04+05:30 IST

మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోమని కేవీపీఎస్‌ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోం

కేవీపీఎస్‌, దళిత సంఘాల నాయకుల హెచ్చరిక


భీమవరం అర్బన్‌, ఆగస్టు 21 : మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోమని కేవీపీఎస్‌ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూటీఎఫ్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్‌ మాట్లాడారు. దళితుల్లో హిందూ, క్రైస్తవ మతం పాటించేవారి వివరాలు, చర్చిలు సంఖ్య, క్రైస్తవ జనాభా వంటి అంశాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మెమో జారీ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజలను విభజించే ఈ మెమోను రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ శాఖకు జారీచేయడమేంటని ప్రశ్నించారు. తక్షణమే మెమోని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, మల్లిపూడి ఆంజనేయులు, బుంగ గణేష్‌, గెడ్డం జార్జి, సువర్ణరాజు, మాణిక్యాలరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T05:10:04+05:30 IST