విద్యుదాఘాతం.. యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-11T04:38:10+05:30 IST

విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతిచెందినట్టు కాళ్ళ ఎస్‌ఐ వి.రాం బాబు మంగళవారం తెలిపారు.

విద్యుదాఘాతం.. యువకుడి మృతి

కాళ్ళ, ఆగస్టు 10 : విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతిచెందినట్టు కాళ్ళ ఎస్‌ఐ వి.రాం బాబు మంగళవారం తెలిపారు.పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన కారెం ప్రదీప్‌ (26) ఎల్‌ఎన్‌పురంలోని రొయ్యల చెరువుపై పక్షులు వాలకుండా వలలు కట్టడానికి మూడు రోజుల కిందట వచ్చాడు. పని ముగించుకుని సోమవారం సాయం త్రం చెరువు నుంచి ఎర్త్‌ వైర్‌ కట్టిన ఇనప స్తంభాన్ని పట్టుకుని ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై  మృతిచెందాడు. మృతుడి భార్య మణిరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు.


Updated Date - 2021-08-11T04:38:10+05:30 IST