ఎస్‌ఆర్‌కేఆర్‌లో క్యాంపస్ క్రానికల్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-08-26T05:12:54+05:30 IST
క్యాంపస్ క్రానికల్ విద్యార్థుల ఆవిష్కరణలకు ఒక వేదికగా ఉంటుందని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు అన్నారు.

భీమవరం ఎడ్యుకేషన్, ఆగస్టు 25 : క్యాంపస్ క్రానికల్ విద్యార్థుల ఆవిష్కరణలకు ఒక వేదికగా ఉంటుందని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు అన్నారు.కళాశాల మేనేజ్‌మెంట్ మీటింగ్ హాల్‌లో బుధవారం విద్యార్థులు సాధించిన విజయాలతో ప్రచురించిన క్యాంపస్ క్రానికల్‌ను ఆవిష్కరించారు. కళాశాల సెక్రటరీ ఎస్‌వీ రంగరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. జగపతిరాజు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయస్థాయి లో సాధించిన విజయాలు క్రానికల్‌లో పొందుపర్చామన్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి దీనిని విడుదల చేస్తామన్నారు.కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు పి.కృష్ణంరాజు, గోకరాజు రామరాజు, గవర్నింగ్ బాడీ సభ్యులు డా.కెఎస్ విజయనర్సింహరాజు, సీఈవో ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ పాల్గొన్నారు.