సీఆర్‌ఆర్ ఫార్మా స్యూటికల్ సైన్సెస్‌లో అవకతవకలు
ABN , First Publish Date - 2021-01-12T05:30:00+05:30 IST
ఏలూరులో వున్న కట్టమంచి రామలింగారెడ్డి ఫార్మా స్యూటికల్ సైన్సెస్ విద్యాలయంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల సొమ్మును నలుగురు వ్యక్తులు స్వాహా చేశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో మంగళవారం కేసు నమోదు చేశారు.

రూ. 1.62 కోట్లు స్వాహా, నలుగురిపై కేసు
ఏలూరు క్రైం, జనవరి 12: ఏలూరులో వున్న కట్టమంచి రామలింగారెడ్డి ఫార్మా స్యూటికల్ సైన్సెస్ విద్యాలయంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల సొమ్మును నలుగురు వ్యక్తులు స్వాహా చేశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో మంగళవారం కేసు నమోదు చేశారు. సీఆర్‌ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ మాగంటి భువనసురేంద్ర వెంకట వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. ఏలూరు సీఆర్‌ఆర్ విద్యాసంస్థలలో ఒక విభాగమైన ఫార్మా స్యూటికల్ సైన్సెస్ విద్యాల యంలో ఫీజులకు సంబంధించిన సొమ్మును ఈడ్పుగంటి సుధీర్‌బాబు, కొమ్మారాణి సంయుక్త, గొరిపర్తి విజయకుమార్, పలిశెట్టి శివరామప్రసాద్ ఫీజు సొమ్ముకు సంబంధించిన ఆర్థిక నష్టం కలుగజేయడమే కాకుండా ప్రభుత్వ జీవోలను తారుమారు చేసి బ్యాంకులలోని లావాదేవీలకు సంబంధించి దొంగ సంతకాలు చేసి మొత్తం ఒక కోటి 62 లక్షల 12 వేల 50 రూపాయలు స్వాహా చేశారని ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారందరిపై ఛీటింగ్ కేసుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.