చెత్త వదిలేస్తారా.. బాధ్యత ఉండక్కర్లేదా..!

ABN , First Publish Date - 2021-11-06T05:08:25+05:30 IST

దీపావళికి సంస్కృత పాఠశాల ఆవరణలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు.

చెత్త వదిలేస్తారా.. బాధ్యత ఉండక్కర్లేదా..!
కొవ్వూరు సంస్కృత పాఠశాల ఆవరణలో బాణసంచా దుకాణాల చెత్త

కొవ్వూరు, నవంబరు 5: దీపావళికి సంస్కృత పాఠశాల ఆవరణలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులు వ్యాపారం చేసుకున్నారు. వారి నుంచి అధికారులు పన్నులు, ఫీజులు వసూలు చేశారు. రెండు రోజుల వ్యాపారం కాగానే ఎక్కడి చెత్త అక్కడ వదిలేసిపోయారు. చెత్త తొలగించే బాధ్యత ఎవరిది. దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులదా.. అనుమతించిన అధికారులదా..? ఆవరణలో చెత్త పాఠశాల విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది, పాఠశాల ప్రాంగణం శుభ్రం చేయించాలని ఎవరూ భావించలేదు. విద్యార్థులు శుక్రవారం ఆ చెత్తలోనే పాఠశాలకు వచ్చారు. వ్యాపారం ముగిసిన తర్వాత వ్యాపారులు వదిలేసి వెళ్లినా పాఠశాల ప్రాం గణం శుభ్రం చేయించడంలో అధికారులు సైతం పట్టనట్టు వ్యవహరిం చడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణవాసులు తప్పుపడుతున్నారు.

Updated Date - 2021-11-06T05:08:25+05:30 IST