నేటి నుంచి సీపీఎం జిల్లా మహాసభలు
ABN , First Publish Date - 2021-11-06T05:08:52+05:30 IST
పట్టణంలోని అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో శనివారం నుంచి సీపీఎం జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం చెప్పారు.

నరసాపురం, నవంబరు 5: పట్టణంలోని అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో శనివారం నుంచి సీపీఎం జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం చెప్పారు. మీరాగ్రంథాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి 250 మంది ప్రతినిఽధులు పాల్గొంటారన్నారు. తొలి రోజున పట్టణంలో భారీ ప్రదర్శన, అంబేడ్కర్ సెంట ర్‌లో బహిరంగ సభ ఉంటుందన్నారు. నాయకులు కవురు పెద్దిరాజు, త్రిమూ ర్తులు, మంచిలి నీలకంఠం, పి.నారాయణరావు, రామాంజనేయులు పాల్గొన్నారు.