పెట్రో మంట
ABN , First Publish Date - 2021-10-29T04:51:53+05:30 IST
గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించలేని ప్రధాని మోదీ పదవిలో కొనసాగే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కోనాల భీమారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్ అన్నారు.

వామపక్షాల ఆందోళన
తణుకు, అక్టోబరు 28: గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించలేని ప్రధాని మోదీ పదవిలో కొనసాగే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కోనాల భీమారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్ అన్నారు. గురువారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో పాపారావు పెట్రోల్ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. నిత్యావసర ధరలు పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బొద్దాని నాగరాజు, పుష్పకుమారి, గార రంగారావు, నాగరత్నం పాల్గొన్నారు.
నిడదవోలు: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని గణేష్‌చౌక్ సెంటరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు ఎస్వీ రమణ, గుమ్మాపు దానియేలు, యర్రా శ్రీను, కె.సత్యనారాయణ, శ్రీరామ్, రాఘవ, నరేష్ పాల్గొన్నారు.
నిడమర్రు: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాల ంటూ సీపీఎం మండల కార్యదర్శి నారపల్లి రమణారావు డిమాండ్ చేశారు. గురువారం భువనపల్లిలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమ ంలో పార్టీ నాయకులు గవర సత్యనారాయణ, వేండ్ర సత్యనారాయణ, చల్లా రాంబాబు, పిల్లా రాము, ఆరుగల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇరగవరం: గ్యాస్, పెట్రోలు, డీజిల్ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ ఇరగవరం మండల కార్యదర్శి నామన వెంక టేశ్వరరావు ఆధ్వర్యంలో తూర్పువిప్పర్రులో ఆందోళన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గిద్ద సూర్యనారాయణ, కుడిపూడి వెంకటరెడ్డి, గుడిమెట్ల కోటేశ్వరరావు, జొన్నలగడ్డ మల్లేశ్వరరావు, సైపురెడ్డి రామసాయి పాల్గొన్నారు.
పెంటపాడు: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం, సీపీఐ నాయకులు చిర్లా పుల్లారెడ్డి, సిరపరపు రంగారావు, కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గురువారం పెంటపాడు గేటు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బంకూరు నాగేశ్వరరావు, తేతలి నాగిరెడ్డి, పూడి బాలాజీ, పెనగంటి దుర్గారావు పాల్గొన్నారు.
భీమడోలు: పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సీపీ ఎం ఆధ్వర్యంలో భీమడోలు జంక్షన్లో ఆటో, ట్రక్టు ఆటో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విచ్చలవిడిగా పన్నులు పెంచుతూ సామాన్యులపై భారం మోపు తున్నదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి సాల్మన్‌రాజు, కేవీపీఎస్ మండల కన్వీనర్ సుమన్‌బాబు, ఆటో యూనియన్ నాయకులు సాంబశివరావు, యోహాను, అంజి తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు/ ఉంగుటూరు: అఖిలపక్షాల ఆధ్వర్యంలో గొల్లగూడెంలో చేబ్రోలు, దూబచర్ల రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సిగ్గుచేటని దీని వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సీపీఎం మండల ఉంగుటూరు ఆర్గనైజర్ కొక్కిరపాటి వెంకట్రావు, టీడీపీ ఎంపీటీసీ గద్దే మంగేష్‌కుమార్, వైసీపీ నాయకులు కటారి నరసింహమూర్తి, నక్కా సుబ్బారావు, మదనమోహనరావు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మండలి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.