గ్యాస్‌ ధరలు తగ్గించాలంటూ ధర్నా

ABN , First Publish Date - 2021-09-03T05:19:21+05:30 IST

మోదీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీపీఎం మండల కార్యదర్శి పీవీ ప్రతాప్‌ అన్నారు.

గ్యాస్‌ ధరలు తగ్గించాలంటూ ధర్నా
గ్యాస్‌ బండలతో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

తణుకు, సెప్టెంబరు 2: మోదీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీపీఎం మండల కార్యదర్శి పీవీ ప్రతాప్‌ అన్నారు. గురువారం వెంకటేశ్వర సెంటర్‌లో పెంచిన గ్యాస్‌ ధరలు ఉపసంహరించాలని ధర్నా నిర్వహించారు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు గార రంగారవు, కడలి వీర్రాజు, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T05:19:21+05:30 IST