పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-06-23T04:44:14+05:30 IST

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు నిరసనగా సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అలివేరు, లంకపాకల, యర్రాయిగూడెం గ్రామాల్లో మంగళవారం ఆందోళన చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై సీపీఐ ఎంఎల్‌ ఆధ్వర్యంలో ధర్నా

బుట్టాయగూడెం, జూన్‌ 22: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు నిరసనగా సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అలివేరు, లంకపాకల, యర్రాయిగూడెం గ్రామాల్లో మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం కారం రాఘవ మాట్లాడుతూ నెలలో 20 రోజులు ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. పెట్రో ధరలతో నిత్యావసర వస్తువుల ధర పెరిగి ప్రజలపై పెనుభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పతనమైనా భారత్‌లో ధరలు పెరగడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. చింతల కృష్ణ, గోగుల చిన్నారెడ్డి, కుంజా రవి, గోగుల పండు, కబ్బడి సోమరాజు, జి.సీతారామరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:44:14+05:30 IST