వ్యాక్సిన్‌పై అపోహలొద్దు

ABN , First Publish Date - 2021-02-06T05:03:18+05:30 IST

కొవిడ్‌ రహిత సమాజం కోసం ముందడుగు వేద్దామని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ అన్నారు.

వ్యాక్సిన్‌పై అపోహలొద్దు
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న సబ్‌ కలెక్టర్‌

నరసాపురం టౌన్‌, ఫిబ్రవరి 5: కొవిడ్‌ రహిత సమాజం కోసం ముందడుగు వేద్దామని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ అన్నారు. రెండో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాల యంలో ఆయన వ్యాక్సిన్‌ వేయిం చుకున్నారు. వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహాలు, భయాలు వద్దన్నారు. దేశవ్యాప్తంగా మొదటి విడత వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి ఉన్నారు.

Updated Date - 2021-02-06T05:03:18+05:30 IST