2011 మందికి కొవిడ్ టీకా
ABN , First Publish Date - 2021-01-21T05:13:52+05:30 IST
కొవిడ్ టీకా మందును జిల్లాలో బుధవారం 2011 మంది హెల్త్ వర్కర్లు వేయించుకున్నారని డీఎంహెచ్వో డాక్టర్ కెఎం సునంద తెలిపారు.

ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 20 : కొవిడ్ టీకా మందును జిల్లాలో బుధవారం 2011 మంది హెల్త్ వర్కర్లు వేయించుకున్నారని డీఎంహెచ్వో డాక్టర్ కెఎం సునంద తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 51 సెషన్ సైట్లలో మొత్తం 4933 మంది హెల్త్వర్కర్లకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా వారిలో 2011 మంది హాజరయ్యారని వివరించారు. ఎవరికీ అనారోగ్య పరిస్థితులు తలెత్తలేదని అందరూ ఆరోగ్యంగానే ఉన్నా రని వివరించారు. నిడదవోలు, ఎ.వేమవరం, కుక్కునూరు పీహెచ్సీల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరూ హాజరుకాలేదు.