కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం సీహెచ్‌సీలో రద్దీ

ABN , First Publish Date - 2021-03-25T05:03:49+05:30 IST

కొవిడ్‌ విజృభిస్తుండడంతో వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలు బారులుతీరుతున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం సీహెచ్‌సీలో రద్దీ
వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

ఆకివీడు, మార్చి 24: కొవిడ్‌ విజృభిస్తుండడంతో వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలు బారులుతీరుతున్నారు. సీహెచ్‌సీలో బుధవారం సుమా రు 120 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు రంగారావు సూచించారు. మాస్క్‌ ధరించకుండా బయటకు రావద్దని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్‌ వాడాలని, చేతులు శుభ్రపరచుకోవాలని తెలిపారు.


కరోనా నివారణకు భద్రతలు పాటించాలి 

సిద్ధాపురం (ఆకివీడు రూరల్‌) : కరోనా భద్రతలు తప్పకుండా పాటించాలంటూ సిద్ధాపురంలో ఏఎన్‌ఎం వరలక్ష్మి, ఆశా వర్కర్లు, గ్రామ పె ద్దలు, మహిళా పోలీస్‌ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపధ్యంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతు లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మాస్క్‌ ధరించకపోతే జరిమానా విధిస్తుందన్నారు.

Updated Date - 2021-03-25T05:03:49+05:30 IST