కొవ్వూరులో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-22T04:49:21+05:30 IST
కరోనా బాధితులు రాజమండ్రి లేదా ఏలూరు వెళ్లవలసి వస్తుందని, ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చే చర్యలు చేపడుతున్నామని మంత్రి తానేటి వనిత అన్నారు.

కొవ్వూరు, మే 21: కరోనా బాధితులు రాజమండ్రి లేదా ఏలూరు వెళ్లవలసి వస్తుందని, ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చే చర్యలు చేపడుతున్నామని మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని, జిల్లా కలెక్టర్ సహకారంతో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. కొవిడ్ ఆసుపత్రికి దాతల సహకారం ఎంతో అవసరమని, ఇటువంటి కష్టకాలంలో దాతలు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తున్నాన న్నారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశీర్వాదం, అక్షయపాత్ర శ్రీని వాస్ రవీంద్ర, ఆర్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.