కొవిడ్ బాధితులను గుర్తించాలి
ABN , First Publish Date - 2021-05-21T04:43:10+05:30 IST
ఫీవర్ సర్వేలో కొవిడ్ లక్షణాలున్న వారిని గు ర్తించడం ద్వారా కరోనాను అంతం చేయవచ్చని చింతలపూడి సబ్ యూనిట్ అధికారి ఎస్‌కే అబ్రార్ హుస్సేన్ అన్నారు.

టి.నరసాపురం, మే 20 : ఫీవర్ సర్వేలో కొవిడ్ లక్షణాలున్న వారిని గు ర్తించడం ద్వారా కరోనాను అంతం చేయవచ్చని చింతలపూడి సబ్ యూనిట్ అధికారి ఎస్‌కే అబ్రార్ హుస్సేన్ అన్నారు. మండలంలోని బొర్రంపాలెంలో గురువారం ఆయన పర్యటించారు. క్షేత్రస్ధాయిలో ఫీవర్ సర్వే తీరును పరి శీలించారు. గ్రామాలలో కొవిడ్ లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతీ శుక్రవారం గ్రా మాలలో డ్రై డే పాటించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వాఽ్యధులను నివారి స్తున్నామన్నారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సర్వేలో గృహాల వద్ద ఉన్న దోమల లార్వాలను గుర్తించి ధ్వంసం చేయాలని సూచించారు.
అవగాహనంతోనే కరోనా నియంత్రణ
చాగల్లు : ప్రజలు కరోనాపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉంటే కరో నా వ్యాప్తిని అరికట్టడంతో పాటు ప్రజలు సురక్షితంగా ఉంటారని డీఎల్‌పీవో బి శివమూర్తి అన్నారు. గురువారం మార్కొండపాడు, బ్రాహ్మణగూడెంలలో పర్యటించిన ఆయన పారిశుద్య పనులను పనులను పరిశీలించారు. తాగునీరు సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాకేష్ కుమార్, త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌జోన్ లో నాలుగు గ్రామాలు
కొయ్యలగూడెం: మండలంలో నాలుగు గ్రామాలను రెడ్‌జోన్లుగా ప్రకటిం చారని ఎస్‌ఐ కే.సతీష్‌కుమార్ తెలిపారు. కన్నాపురం, గవరవరం, రామాను జపురం, సరిపల్లె గ్రామాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున ఈ గ్రామాలను రెడ్ జోన్‌లుగా పెట్టారన్నారు. ఈ గ్రామాల్లో 21 నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొవిడ్ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న బయ్యన్నగూడెం గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు కోరా రు. కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ గ్రామాన్ని కూడా రెడ్‌జోన్‌లో చేర్చాలని ఉన్నతాధికారులు, మండల అధికారులకు, వినతిపత్రాన్ని కూడా పంపినట్లు ఆయన తెలిపారు.
పోలవరం నియోజకవర్గంలో కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కొయ్యలగూడెం సర్పంచ్ ముప్పిడి విజయకుమారి కోరారు. ఆసుపత్రి ఏర్పా టు కోరుతూ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. పక్క నియోజకవర్గాల్లోని గోపాలపురం, చింతలపూడి ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దూరాభారం, సమయాభావంతో బాధితులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరితగతిన వైద్య సేవంలందించేందుకు అనువుగా నియోజకవర్గంలోనే పెద్ద మండల కేంద్రమైన కొయ్యలగూడెంలో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.
