కరోనా దూకుడు

ABN , First Publish Date - 2021-05-19T04:53:15+05:30 IST

పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కరోనా దూకుడు
ఆకివీడులో కరోనా బాధితురాలిని తరలిస్తున్న 108 సిబ్బంది

రోజురోజుకు పెరుగుతున్న కేసులు

భీమవరం క్రైం, మే 18 : భీమవరంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భీమవరం పరిధిలో 78 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వన్‌టౌన్‌ పరిధిలో 35, టూటౌన్‌ పరిధిలో 27, రూరల్‌ పరిధిలో 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


పెనుమంట్ర : కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. బయటకు రావాలంటనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 24 కేసులు నమోదయ్యాయని డాక్టర్‌ కార్తీక్‌ తెలిపారు. మార్టేరు 2, పొలమూరు 4, నెగ్గిపూడి 4, మాముడూరు 4, నత్తారామేశ్వరం 3, మల్లిపూడి 2, సత్యవరం 2, ఆలమూరు, పెనుమం ట్ర, జుత్తిగ ఒక్కొక్క కేసు నమోదైనట్టు చెప్పారు. 


పాలకొల్లు అర్బన్‌/రూరల్‌ :  పట్టణంలో  20 మందికి, గ్రామాల్లో 14 పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారులు తెలిపారు. పట్టణ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ఏఎంసీ ఆవరణలో 45 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని  నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎల్‌ కె.కామరాజు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారి డాక్టర్‌ కె.అశ్వని తెలిపారు. 35 మందికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు, 10 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేసినట్టు తెలిపారు.లంకలకోడేరు పీహెచ్‌సీలో 35 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పట్టణంలో ఇంటింటికి ఫీవర్‌ సర్వే 7వ దశ నిర్వహిస్తున్నామన్నారు.


మొగల్తూరు : మండలంలో 17 గ్రామాల్లోనూ మంగళవారం 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తహసీల్దార్‌ ఎస్‌కె హుస్సేన్‌ తెలిపారు. మండలంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 629కి చేరింది. 


యలమంచిలి :మండల మూడు పీహెచ్‌సీల పరిధిలో 21 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఏనుగువానిలంక 3, యలమంచిలి 3, కనకాయలంక 3, బాడవ 2, కొంతేరు 2, శిరగాలపల్లి 2, మట్లపాలెం 2, నేరేడుమిల్లి, పెదలంక, గుంపర్రు, లక్ష్మీపాలెంలలో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.133 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 


వీరవాసరం :  వీరవాసరం, కొణితివాడ పీహెచ్‌సీల పరిధిలో 87 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌ గుర్తించారు. వీరవాసరంలో 16 వీఆర్‌డీఎల్‌ ,37 ర్యాపిడ్‌ చేయగా 15 మందికి పాజిటివ్‌ వచ్చింది.కొణితివాడలో 31 వీఆర్‌డీఎల్‌,ఒక రాపిడ్‌ పరీక్ష చేశారు. 


పోడూరు : మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే గరిష్టంగా 45 కేసులు నమోదయ్యాయని ఎంపీడీవో కె.కన్నమనాయుడు తెలిపారు. గత నాలుగు రోజుల కిందట 41 కేసులు వచ్చాయి. మళ్లీ నాలుగు రోజులకే ఇన్ని కేసులు నమోదుకావడం పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మట్టపర్రులో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. పోడూరు 7, జిన్నూరు, పండితవిల్లూరు గ్రామాల్లో  ఆరు చొప్పున నమోదయ్యాయి. కవిటం, వేడంగి పెనుమదం గ్రామాల్లో నాలుగేసి, గుమ్మలూరులో 3, వద్దిపర్రులో 1, మొత్తం 47 కేసులు నమోదయ్యాయి. పోడూరు పీహెచ్‌సీలో మంగళవారం 102 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్టు డాక్టర్‌ ఎస్‌.కీర్తికిరణ్‌ తెలిపారు.  


 నరసాపురం : పట్టణ పరిధిలో మంగళవారం ఐదు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు నోడల్‌  అధికారి డాక్టర్‌ స్వరూప్‌ చెప్పారు. వార్డుల్లో నిర్వహించిన ఫీవర్‌ సర్వేలో 65 మందిని గుర్తించామన్నారు. వీరికి బుధవారం కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తామన్నారు. 


ఉండి  :ఉండిలో ఒక కరోనా కేసు నమోదైందని ఎంపిడివో గంగాధరరావు మంగళవారం  తెలిపారు. ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.


టైలర్‌ సంఘ నాయకురాలు మృతి

భీమవరం, మే 18 : శ్రీప్రగతి పట్టణ టైలర్‌ అసోసియేషన్‌ సభ్యురాలు పద్మ కరోనాతో మరణించారు.ఆమె అకాల మరణం తీరని లోటని టైలర్‌ అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం ప్రకటించారు.చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


ఆకివీడులో ఇద్దరు మృతి..

ఆకివీడురూరల్‌ : మండలంలో 9 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యులు తెలిపారు. ఆకివీడు పట్టణం 5, అజ్జమూరు–2,    సిద్ధాపురం,అయిభీమవరంలలో ఒక్కో కేసు నమోదైనట్టు తెలిపారు.  సిద్ధాపురం గ్రామంలో ఇద్దరు కరోనాతో మృతిచెందినట్టు సచి వాలయ సిబ్బంది తెలిపారు. భీమవరం సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఒకరు, మెరుగైన వైద్య సేవలకు విజయవాడ తరలి స్తుండగా మార్గమధ్యలో మరొకరు మృతిచెందినట్టు తెలిపారు. 


Updated Date - 2021-05-19T04:53:15+05:30 IST