యాక్టివ్‌ కేసులు 10218

ABN , First Publish Date - 2021-05-08T06:06:03+05:30 IST

కొవిడ్‌ పేషెంట్లతో ఆసుపత్రులు, క్వారంటైన్‌ సెంటర్లు కిటకిటలాడుతు న్నాయి.

యాక్టివ్‌ కేసులు 10218
ఏలూరు

ఆస్పత్రులు, క్వారంటైన్లలో కొవిడ్‌ బాధితులు

కొత్తగా 905 పాజిటివ్‌ కేసులు.. ఐదుగురి మృతి

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 7 : కొవిడ్‌ పేషెంట్లతో ఆసుపత్రులు, క్వారంటైన్‌ సెంటర్లు కిటకిటలాడుతు న్నాయి. శుక్రవారం సాయంత్రం వరకు వెల్లడైన కొవిడ్‌ టెస్టుల ఫలితాల్లో కొత్తగా 905 మందికి పాజి టివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పత్రులు, క్వారం టైన్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న బాధితుల సం ఖ్య 10 వేల 218కి పెరిగింది. వీరిలో అత్యధికులు హోం ఐసొలేషన్‌లోనే ఉంటూ వైద్యం తీసుకుంటు న్నట్టు ఆరోగ్య శాఖ వర్గాలు వివరించాయి. కరోనా కారణంగా జిల్లాలో ఐదుగురు మరణించారు. తాజా కేసులతో జిల్లాలో 42 చోట్ల కొత్తగా కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు కానున్నాయి. నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్ట ణాలు, ఇరగవరం మండలం తొలి వరుసలో ఉండ గా భీమడోలు, చింతలపూడి, దేవరపల్లి, గణపవరం, కామవరపుకోట, గోపాలపురం, మొగల్తూరు, నరసా పురం, పాలకొల్లు, పెంటపాడు, పెనుగొండ, పెను మంట్ర, ఉండి, యలమంచిలి, ఉంగుటూరు, వీరవా సరం మండలాల్లో గణనీయంగానే కేసులు నమోద వుతున్నాయి. బాధితుల్లో అత్యధికులు పురుషులే. రాబోయే రోజుల్లో మరింత పెరగనున్నాయి.


కోవిషీల్డ్‌ ఖాళీ

గురువారం రాత్రి జిల్లాకు దిగుమతి అయిన ఏడు వేల డోసులతో పాటు, అక్కడక్కడ సీవీసీల్లో నిల్వ ఉన్న వ్యాక్సిన్‌ కలిపి మొత్తం తొమ్మిది వేల డోసుల కోవిషీల్డ్‌ టీకా మందు పంపిణీ శుక్రవారం జిల్లాలోని 84 వ్యాక్సినేషన్‌ సెంటర్ల (సీవీసీ)లో నిర్వ హించారు. సాయంత్రానికి 90 శాతానికి పైగా వ్యాక్సి న్‌ ఖాళీ అయ్యాయి. కాగా శుక్రవారం మధ్యాహ్నం మరో ఆరు వేల డోసుల కోవాగ్జిన్‌ జిల్లాకు దిగుమతి అయ్యాయి. వీటిని శనివారం ఎంపిక చేసిన గ్రామ/ వార్డు సచివాలయాల్లో మాత్రమే కేవలం రెండో డోసుకు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలి డోసు కోవాగ్జిన్‌ పం పిణీచేసిన సచివాలయాలు, లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు. కోవాగ్జిన్‌ రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న లబ్ధ్దిదారుల్లో ఐదు వేల మందికిపైగా ఏలూరు, పరిసర ప్రాంతాల్లోనే ఉండగా, జిల్లాకు పరిమితంగా అందిన నిల్వలను పంపిణీ చేయడం జిల్లా ఆరోగ్య శాఖకు ఓ సవాల్‌గా పరిణమించింది. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కొన్నిచోట్ల నియంత్రణ లేక పోవడంతో ఒకరినొకరు తోసుకుంటూ కరోనా కేసులు పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 


ఉపాధ్యాయురాలి మృతి

పెదపాడు, మే 7 : కొత్తూరు ప్రాథమిక పాఠశా లలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, పోలవరం ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న ఆమె భర్త కొన్నిరోజుల క్రితం కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో వీరిరువురూ ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉపాధ్యాయురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. 


నిండు గర్భిణీ..

నరసాపురం, మే 6 : కొవిడ్‌తో రెండు వారాలుగా పోరాడిన ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. పట్టణం లోని వైఎస్‌ఆర్‌ కాలనీకి సమీపంలో ఉంటున్న ఒక కుటుంబంలో నలుగురికి రెండు వారాల క్రితం పాజిటివ్‌ సోకింది. వారిలో గర్భిణి ఉండటంతో కుటుంబ సభ్యులంతా మెరుగైన వైద్యం కోసం హైద రాబాద్‌ వెళ్లిపోయారు. అక్కడ ఒక కార్పొరేట్‌ ఆస్ప త్రిలో చేరారు. ముగ్గురు కోలుకోగా గర్భణి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. శుక్రవారం చికిత్స పొం దుతూ మృతి చెందింది. ఈ విషాద సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, పరిసర ప్రాంత ప్రజలు షాక్‌కు గురయ్యారు.


ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌..

ఉంగుటూరు, మే 7 : చేబ్రోలు లిక్కర్‌ ఫ్యాక్టరీలో విధి నిర్వహణలోవున్న ఓ ఎక్సైజ్‌ కాని స్టేబుల్‌ (52) గురువారం రాత్రి భీమవరంలోని ప్రైవేటు ఆసు పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.



ప్రభుత్వ కార్యాలయ పనివేళలు

ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే..

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 7 : కరోనా ఉధృతి, పగటి కర్ఫ్యూ నిబంధనల నేపథ్యంలో ఉద్యోగ పనివేళలను పరిమితం చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ ఎన్జీ వోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎస్‌.హరనాథ్‌, సి.హెచ్‌.శ్రీనివాస్‌, పీఆర్టీయూ  రాష్ట్ర సహ అధ్యక్షుడు పి.ఆంజనేయులు తెలిపారు. ఆ ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో ఉద్యోగులు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తి స్తారు. ఆ తర్వాత ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఎవరైనా మధ్యాహ్నం 12 గంటలు తర్వాత కూడా కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి వస్తే సంబంధిత ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేటప్పుడు పోలీసులు అభ్యంతరం పెట్టకుండా చూపేందుకు వీలుగా కార్యాలయ అధిపతి పాస్‌లు ఇస్తారు. ఈ పరిమిత పనివేళలు అత్య వసర సేవలు, కొవిడ్‌ వైద్య సేవలతో ముడిపడి ఉన్న వైద్య ఆరోగ్యశాఖ,             విద్యుత్‌,  మునిసిపల్‌, అర్బన్‌ డవలప్‌ మెంట్‌ అథారిటీ, పంచాయతీరాజ్‌ శాఖల ఉద్యోగులకు వర్తించవు. పగటి కర్ఫ్యూ నిబంధనలు ముగిసే వరకు అంటే ఈనెల 18 వరకు తాజా ఉత్తర్వులు అమలులో ఉంటాయి. 


Updated Date - 2021-05-08T06:06:03+05:30 IST