జోరుగా సెకండ్‌ వేవ్‌!

ABN , First Publish Date - 2021-05-03T04:47:55+05:30 IST

రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

జోరుగా సెకండ్‌ వేవ్‌!
కాళ్ళలో కొవిడ్‌ నిబంధనల మధ్య జరిగిన సమావేశం

పల్లెలు.. పట్టణాల్లో కరోనా దూకుడు

భీమవరం క్రైం : భీమవరం పట్టణంలో ఆదివారం ఒక్కరోజే 70 పాజిటివ్‌ కేసులు వచ్చాయని భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ కృష్ణభగవాన్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే నిండాయని అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు.


పెనుమంట్ర : మండలంలో కరోనా ప్రభావం తీవ్ర ంగా ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆదివారం 42 కేసులు నమోదయ్యాయి. మార్టేరు 11, నెగ్గిపూడి 7, భట్లమగుటూరు 2,  జుత్తిగ 2, మాముడూరు 2,  పెనుమంట్ర 4, మల్లిపూడి, నత్తారామేశ్వరం, పొలమూరు , వెలగలేరులో ఒక్కొక్కటి నమోదయ్యాయని వైద్యాధికా రులు కార్తీక్‌,లావణ్య తెలిపారు.


ఉండి : మండలంలో 39 కరోనా కేసులు నమోద య్యాయని ఎంపీడీవో మురళీ గంగాధరరావు ఆదివారం తెలిపారు. మహదేవపట్నం 8, ఉండి 7, యండగండి 5, పెదపుల్లేరు 4, ఎన్‌ఆర్‌పి అగ్రహారం 4, కలిసిపూడి 4, కలి గొట్ల 3, ఉణుదుర్రు 2, చిలుకూరు, చెరుకువాడ ఒక్కొ క్కటి చొప్పున నమోదయ్యాయని తెలిపారు.  


నరసాపురం : పట్టణ పరిధిలో ఆదివారం 13 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు పట్టణ ఆరోగ్యశాఖ  నోడల్‌ అధికారి డాక్టర్‌ స్వరూప్‌ చెప్పారు. కావలి అదినారాయణ వీధిలో నాలుగు, శ్రీహరిపేట రెండు, వలవలవారివీధి, టైల ర్‌పేట, చిన్నమామిడిపల్లి,రుస్తుంబాద, వీవర్స్‌కాలనీ, 29వ వార్డులో ఒక కేసు నమోదైనట్టు చెప్పారు. 


ఆకివీడు : ఆకివీడు మండలంలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు పీహెచ్‌సీ ఎంపీహెచ్‌వో సత్యనారాయణ ఆదివారం తెలిపారు. మాదివాడ, చెరుకుమిల్లి, గుమ్ములూరు, దుంపగడపలలో ఒక్కొక్కటి, పెదకాపవరంలో మూడు కేసులు వచ్చాయన్నారు. 


పాలకోడేరు : కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. గ్రామాల్లో వైద్యసిబ్బంది టెస్ట్‌లు పెంచడంతో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.ఆదివారం కోరుకొల్లు 2, గొల్లలకోడేరు 3, మైప,పాలకోడేరు, విస్సాకోడేరు ఒక్కో కేసు నమోదయ్యాయి. మొత్తం 8 మందిని తాడేరు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్లు తహసీల్దార్‌ కోరం రాజకిషోర్‌ తెలిపారు. ముగ్గురు హోంక్వారంటైన్‌లో ఉన్నారన్నారు. 


యలమంచిలి : మండలంలో ఆదివారం 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాడవ 5, మేడపాడు 2, దొడ్డిపట్ల 3, మట్లపాలెం 2, అబ్బిరాజుపాలెం 2, ఇల పకుర్రు 3, బూరుగుపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధా రణ అయినట్టు యలమంచిలి, మేడపాడు పీహెచ్‌సీల ఎంపీహెచ్‌ఈవోలు ఎం.వి.సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, దొడ్డిపట్ల  హెల్త్‌ ఎడ్యుకేటర్‌ టి.నాగరాజు తెలిపారు.


పెనుగొండ : మండలంలో 21 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ఎంపీడీవో పురుషోత్తం తెలిపారు. పెనుగొండ 9, రామన్నపాలెం 2, వడలి 3, వెంకట్రాయపురం 2, చినమల్లం,ములపర్రు,దేవలో ఒక్కొక్క నమోదయ్యాన్నారు.

ఆచంట : మండలంలో ఆరు కేసులు నమోదైనట్టు  అధికారులు తెలిపారు. ఆచంట 4, వల్లూరు 2 నమోద య్యాయని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. 


నేటి నుంచి భీమవరంలో 3  గంటలకే షాపులు బంద్‌

భీమవరం క్రైం, మే 2 : పట్టణంలో  ఈ నెల 3వ తేదీ నుంచి దుకాణాలు 3 గంటల వరకే ఉంటాయని వన్‌టౌన్‌ సీఐ ఎ.కృష్ణభగవాన్‌ తెలిపారు. కరోనా పాజి టివ్‌ కేసులు పెరుగుతూ ఉండడం వల్ల చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో వ్యాపారులు నిర్ణయం తీసుకు న్నారని తెలిపారు.కరోనా కట్టడి నేపథ్యంలో మధ్యా హ్నం 3 గంటలకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివే యాలని కోరారు.వ్యాపారులు సహకరించాలన్నారు.

Updated Date - 2021-05-03T04:47:55+05:30 IST