కొవిడ్‌ కేర్‌

ABN , First Publish Date - 2021-05-25T05:02:18+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

కొవిడ్‌ కేర్‌
బుట్టాయగూడెంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

గిరిజన ప్రాంతాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు


బుట్టాయగూడెం, మే 24: గిరిజన ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. బుట్టాయగూడెం సీహెచ్‌సీలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయలక్ష్మి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 30 పడకల కోవిడ్‌ కేర్‌ ఆసుపత్రిని సోమవారం ప్రారంభించారు. కొవిడ్‌ బాధి తులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తు న్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు దూరప్రాంతాల ఆసుపత్రులకు వెళ్లకుండా సమీపంలోనే వైద్యసేవలు పొందవచ్చన్నారు. ఏజెన్సీలోని గిరిజ నులు, ఇతరులు ఆసుపత్రి సదుపాయాలను ఉపయోగించుకుని కరోనా కట్ట డిలో భాగస్వాములు కావాలన్నారు. బాధితులకు వైద్య సేవలందించడంలో అలసత్వం వద్దని సంబంధిత అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. బాధితులకు కావలసిన మందులు, ఇతర అవసరాల కోసం ఏర్పాట్లు చేయా లన్నారు. అత్యవసర కేసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర అత్యవసర పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అనంతరం ఐసొలేషన్‌ వార్డులను పరిశీలించారు. కార్యకమ్రంలో ఆర్డీవో వైవీ.ప్రసన్నలక్ష్మి, జిల్లా ఉప వైద్యాధికారి సీహెచ్‌ ము రళీకృష్ణ, పీవో ఆర్‌వి సూర్యనారాయణ, డీడీ జె.వెంకటేశ్వరావు, డీఎస్పీ లతా కుమారి, ఎంపీడీవో ఎం.రాజు, తహసీల్దార్‌ రమేష్‌, వైద్యాధికారులు, సర్పంచ్‌ తెల్లం వెంకాయమ్మ సిబ్బంది పాల్గొన్నారు.


చేగొండపల్లిలో 20పడకల ఐసోలేషన్‌ కేంద్రం


పోలవరం: మండలంలోని పునరావాస గ్రామం చేగొండపల్లి గిరి జన బాలుర ఆశ్రమ వసతిగృహంలో 20 పడకల ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వసతిగృహంలో ఐదు గదులకు నాలుగు బెడ్‌లు చొప్పున ఏర్పాటుచేసి తాగునీరు, విద్యుత్‌, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు సిద్ధం చేశారు. సౌకర్యాలను  తహసీల్దార్‌ సుమతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రామకృష్ణ స్వయంగా పరిశీలించారు. ఇళ్లలో ఐసొలేషన్‌ వీలులేనివారు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.


గండిగూడెం గ్రామస్థుల నిరసన

టి.నరసాపురం: గండిగూడెం యూపీ పాఠశాలలో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ సోమవారం గ్రామస్థులు బైఠాయించారు. గ్రామానికి సమీపంలో ఐసోలేషన్‌ కేంద్రంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ కె.నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ కె.రామకృష్ణ గ్రామస్థులకు అవగాహన కల్పించడంతో శాంతించారు. అనంతరం ఐసొలేష న్‌ కేంద్రం రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాకాని వెంకటేశ్వరరావు, పేరుబోయిన వీర్రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


బోయగూడెంలో ప్రత్యేక వైద్య శిబిరం

చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీలో కొవిడ్‌ కేసులు పెరగడంతో గుర్తించి బోయగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్య  శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్ల వద్దకు వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు. మండల కొవిడ్‌ అధికారి కిరణ్‌ చైతన్య మాట్లాడుతూ బోయగూడెంలో అధికంగా కేసులు నమోదవుతున్నా యని గుర్తించి శిబిరంతోపాటు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని గుర్తించి బయటకు రావద్దని, హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. దీనివల్ల కరోనా నియంత్రణకు సహకరించన వారవుతార న్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయినా భయం లేదని ఇంటి వద్దకు వచ్చే ఆరో గ్య సిబ్బంది ఇచ్చిన మందులు వాడాలని సూచించినట్లు చెప్పారు. కొవిడ్‌ కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో నగర పంచాయతీ అధికారులు రోడ్లు శుభ్రం చేసి శానిటేషన్‌ చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్‌ నల్లా రాంబాబు తెలిపారు. సోమవారం పట్టణంలోకి అధికంగా చుట్టు పక్కల నుంచి కొను గోళ్లకు ప్రజలు వస్తుంటారు. ఈనేపథ్యంలో చింతలపూడి సీఐ ఎంవిఎస్‌ మల్లేశ్వరరావు రద్దీగా ఉన్నచోట్ల మాస్క్‌లు లేనివారిని నిలుపుదల చేసి హెచ్చరికలు, అవగాహన కల్పించారు.

Updated Date - 2021-05-25T05:02:18+05:30 IST