గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ నిరసన ప్రదర్శన

ABN , First Publish Date - 2021-05-19T05:27:51+05:30 IST

గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ అందరిని కరోనా వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌ వేయించాలని హెచ్‌పీ గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకులు జువ్వల రాంబాబు, ఎస్‌వీ రమణ డిమాండ్‌ చేశారు.

గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ నిరసన ప్రదర్శన
నిడదవోలులో సీఐటీయూ నేతలు రాంబాబు, తదితరుల నిరసన

నిడదవోలు, మే 18 : గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ అందరిని కరోనా వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌ వేయించాలని హెచ్‌పీ గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకులు జువ్వల రాంబాబు, ఎస్‌వీ రమణ డిమాండ్‌ చేశారు. నిడదవోలులో హెచ్‌సీ గ్యాస్‌ వర్కర్స్‌ యూ నియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న సమయంలో కూడా ఇంటింటికి గ్యాస్‌ చేరవేస్తున్నారని ఈ నేపథ్యంలో కొంతమంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సేవలను గుర్తించి వ్యాక్సినేషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పండు, శ్రీరామ్‌, రాఘవ, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T05:27:51+05:30 IST