ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-29T05:20:03+05:30 IST

భీమడోలు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
నిడదవోలులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు

భీమడోలు, డిసెంబరు 28 : భీమడోలు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యర్రం శెట్టి ఏడుకొండలు, పాలేటి బ్రహ్మారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తణుకు: కాంగ్రెసు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలో నిర్వహించారు.  పట్టణ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్‌ నాయకులు అల్లూరి అర్జున్‌రాజును సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దిర్శిపో రామకృష్ణ, కడలి రామారావు, ఆకుల సాయి, సవిరిగాని బోసు, కాశీ తదితరులు పాల్గొన్నారు.

గణపవరం: కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిప్పర పార్టీ కార్యాల యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌ రాజు మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీతోనే పేద బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని నరసాపురం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మార్నిడి బాబ్జి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌.అప్పారావు, పాలూరి శ్రీనివాస్‌, ఎ.శేఖర్‌, ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

నిడదవోలు: పట్టణంలోని బస్టాండ్‌ సెంటరులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద  కాంగ్రెస్‌ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ  కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి సుబ్బారావు, పట్టణ అధ్యక్షుడు కారింకి వెంకటేశ్వరరావు, నాయకులు చిన్నం మురళీకృష్ణ, సత్యనారాయణ, వెంకట్రావు, హీరాలాల్‌, కాశీం, ఉషారాణి, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-29T05:20:03+05:30 IST