ఉత్తరప్రదేశ్‌ సంఘటనపై రైతుల నిరసన

ABN , First Publish Date - 2021-11-29T04:54:26+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో దళిత కుటుంబంలో నలు గురు సభ్యులను దారుణంగా హత్యచేసి, బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటనపై దళిత సంఘాల ఐక్య వేదిక, అంబేడ్కర్‌ ఇండియా మిష న్‌ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఉత్తరప్రదేశ్‌ సంఘటనపై రైతుల నిరసన
దోషుల దిష్టిబొమ్మ దహనం చేస్తున్న దళిత సంఘాల నాయకులు

చింతలపూడి, నవంబరు 28: ఉత్తరప్రదేశ్‌లో దళిత కుటుంబంలో నలు గురు సభ్యులను దారుణంగా హత్యచేసి, బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటనపై దళిత సంఘాల ఐక్య వేదిక, అంబేడ్కర్‌ ఇండియా మిష న్‌ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాత బస్టాండ్‌ సెంటర్‌లో దోషులు, నిర్లక్ష్యం వహించిన అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ జిల్లా కార్యదర్శి కాకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టాలు ఉన్నప్పటికీ నేరాలను అరికట్టలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేడబడి సెంటర్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. సొసైటీ అధ్య క్షుడు ఎ.సుబ్బారావు, కంచర్ల బుచ్చిబాబు, ఏలియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:54:26+05:30 IST