ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-12-31T05:12:57+05:30 IST
షెడ్యూల్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారు, ప్రభుత్వ, ఆర్ అండ్ బి స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.మంగరాజు తహసీల్దార్ వైవీ.లక్ష్మీకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు.

బుట్టాయగూడెం, డిసెంబరు 30: షెడ్యూల్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారు, ప్రభుత్వ, ఆర్ అండ్ బి స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.మంగరాజు తహసీల్దార్ వైవీ.లక్ష్మీకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు. రెడ్డిగణపవరం పంచాయతీ రామారావుపేట సెంటరులో గిరిజనేతరులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు పాల్పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. అక్రమణ కట్టడాలను ప్రశ్నించే గిరిజనులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంగరాజు తెలిపారు. ఏఎస్‌ఆర్ యూత్ కమిటీ నాయకుడు పవన్, కుంజా రవి, పూనెం శ్రీనివాస రావు, దారి రాజ్‌కుమార్, కారం కోటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.