ఉపాధి పనులు వేగవంతం కావాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-24T04:49:14+05:30 IST

గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మెటీ రియల్‌ కాంపొనెంట్‌ పనుల వేగం పెంచాలని కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఉపాధి పనులు వేగవంతం కావాలి : కలెక్టర్‌
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ మిశ్రా, జేసీ శుక్లా

ఏలూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మెటీ రియల్‌ కాంపొనెంట్‌ పనుల వేగం పెంచాలని కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు వేగం పెంచాలన్నారు. ఆర్బీకేలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీలు నిర్వహణ వేగంగా జరగాలన్నారు. గ్రామా భివృద్ధి ప్రణాళికను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆయన సూచించారు. గ్రామ సభలు నిర్వహించి వివరాలు అప్‌లోడ్‌ చేయాలని, జల జీవన్‌మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించే కార్యక్రమం చేపట్టాలన్నారు. జగన న్న తోడు పథకంలో రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. జేసీ శుక్లా, జడ్పీ సీఈవో హరిహరనాథ్‌, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రభాస్కరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T04:49:14+05:30 IST