ఏజెన్సీలో అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-28T05:09:24+05:30 IST

ఏజెన్సీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీజనల్‌ వ్యాధులు, జ్వరాల నియంత్రణ అంశాలపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం కేఆర్‌ పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన అధికారుల సమా వేశంలో సమీక్షించారు.

ఏజెన్సీలో అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్ష
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

బుట్టాయగూడెం, ఆగస్టు 27: ఏజెన్సీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీజనల్‌ వ్యాధులు, జ్వరాల నియంత్రణ అంశాలపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం కేఆర్‌ పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన అధికారుల సమా వేశంలో సమీక్షించారు. అన్నిశాఖల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖల పనితీరుపై సమీక్షిస్తూ సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు, మలేరియా, డెంగీ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడిలో కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నా రు. ఈ–క్రాప్‌ అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు తమ పరిధిలో అభివృద్ధి సమీక్షించుకుంటూ పనులను వేగవంతం చేయాల న్నారు. అనంతరం గిరిజన సంక్షేమ గురకుల బాలుర పాఠశాల, కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. వసతులు, ఇతర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఐటిడిఎ పీవో ఓ.ఆనంద్‌, ఆర్డీవో వైవి ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ లతాకుమారి జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్‌ల పరిధిలోని అనిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:09:24+05:30 IST