రుణ వితరణ మహోత్సవం

ABN , First Publish Date - 2021-10-28T05:38:14+05:30 IST

రైతులు, ఖాతాదా రులు బ్యాంకుకు వచ్చినప్పుడు వారి సమస్యను విని సాధ్యమైనంత మేర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కార్తి కేయ మిశ్రా బ్యాంకర్లను కోరారు.

రుణ వితరణ మహోత్సవం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌

రైతుల సమస్యలు పరిష్కరించాలి : బ్యాంకర్లను కోరిన కలెక్టర్‌ 


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 27 : రైతులు, ఖాతాదా రులు బ్యాంకుకు వచ్చినప్పుడు వారి సమస్యను విని సాధ్యమైనంత మేర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కార్తి కేయ మిశ్రా బ్యాంకర్లను కోరారు. బుధవారం సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ సమ న్వయంతో అన్ని బ్యాంకర్లతో రుణ వితరణ మహోత్సవా న్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఖరీఫ్‌ సీజన్‌లో సీపీఆర్‌సీ కార్డుల ద్వారా రూ.152 కోట్లు కౌలుదారులకు రుణాలుగా అందజేయగా, ఈ ఏడాది రూ.190 కోట్లు అందజేస్తున్నామన్నారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలుగా రూ.6,500 కోట్లు అందించినట్టు వివరించారు. బ్యాంకులు, డీఆర్‌డీఏ స్టాల్స్‌ను కలెక్టర్‌ సందర్శించి, వారు ప్రజలకందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వివిధ బ్యాంకులు జారీచేసిన రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్‌ అందజేశారు. లీడ్‌ బ్యాంక్‌ కన్వీనర్‌ ఐ.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు, యూనియన్‌ బ్యాంక్‌ ఎఫ్‌జీఎం ప్రసాద్‌, డీజీఎం దుమ్మేశ్వరరావు, ఎస్‌బీఐ డీజీఎం రంగరాజన్‌, యూబీఐ డీజీఎం రామారావు తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-10-28T05:38:14+05:30 IST