కౌన్సిల్‌కు కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

ABN , First Publish Date - 2021-08-22T04:45:31+05:30 IST

మున్సిపల్‌ కార్యాలయంలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక నిర్వహించారు.

కౌన్సిల్‌కు కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

నిడదవోలు, ఆగస్టు 21: పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక నిర్వహించారు. జనరల్‌ నుంచి దిరిసిన రామచంద్రరావును కో–ఆప్షన్‌ సభ్యుడిగా వైస్‌ చైర్మన్‌ యలగాడ బాలరాజు ప్రతిపాదించగా 14వ వార్డు కౌన్సిలర్‌ బిర్రే పార్వతి బలపరిచారు. సయ్యద్‌ వలీని 22వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ వజీరుద్దీన్‌ ప్రతిపాదించగా 3వ వార్డు కౌన్సిలర్‌ షాకీరాబేగం బలపరిచారు. అస్మత్‌ జయశ్రీని వైస్‌ చైర్మన్‌ జి.వెంకటలక్ష్మి ప్రతిపాదించగా 8వ వార్డు కౌన్సిలర్‌ శాంతిశ్రీ బలపరిచారు. కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ముగ్గురు కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ, పువ్వుల రతీదేవి, కమిషనర్‌ కేవీ పద్మావతి పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T04:45:31+05:30 IST