ఈనెల 21న తణుకులో సీఎం Jagan పర్యటన

ABN , First Publish Date - 2021-12-19T14:37:32+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు.

ఈనెల 21న తణుకులో సీఎం Jagan పర్యటన

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఎం వస్తున్నారని పట్టణంలో షాపులు మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు షాపులు తెరవవద్దని మర్చంట్స్ ఛాంబర్స్ సభ్యులకు సూచించారు. పండుగ సీజన్ కావడంతో షాపులు తీయాలని షాపుల యజమానులు  ముందుగానే నిర్ణయించుకున్నారు. కాగా అధికారులు, మర్చంట్స్ ఛాంబర్స్ సూచనలతో  షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. 

Updated Date - 2021-12-19T14:37:32+05:30 IST