ముగిసిన షూటింగ్‌ బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-03-23T05:15:52+05:30 IST

క్రీడాకారులు నిరంతరం సాధ న చేస్తూ క్రమశిక్షణతో ఆటలో మెలకువలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని భీమడోలు సీఐ వి.సుబ్బారావు అన్నా రు.

ముగిసిన షూటింగ్‌ బాల్‌ పోటీలు
షూటింగ్‌ బాల్‌ పోటీల్లో తలపడుతున్న జట్లు

విజేతలుగా గుంటూరు, విజయనగరం జట్లు 

దెందులూరు, మార్చి 22: క్రీడాకారులు నిరంతరం సాధ న చేస్తూ క్రమశిక్షణతో ఆటలో మెలకువలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని భీమడోలు సీఐ వి.సుబ్బారావు అన్నా రు. కొత్తగూడెం పంచాయతీ శింగవరంలో రెండు రోజులుగా జరుగుతున్న అంతర జిల్లాల 39వ సబ్‌ జూనియర్‌ బాల బాలికల షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి.  బాలికల విభాగం ఫైనల్స్‌లో విశాఖపై గుంటూరు జిల్లా జట్టు, బాలుర విభాగంలో గుంటూరుపై విజయనగరం జట్టు విజయం సాధించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథిగా విచ్చేసిన సీఐను అసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పృఽథ్వీకుమార్‌, కార్యదర్శి జోసెఫ్‌, చైర్మన్‌ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు మనోహ ర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-23T05:15:52+05:30 IST