9 నుంచి సీఐటీయూ రాష్ట్ర సమావేశాలు

ABN , First Publish Date - 2021-12-31T05:23:45+05:30 IST

తాడేపల్లిగూడెంలో జనవరి 9,10,11 తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘ నాయకుడు ఎం.ఆంజనేయులు అన్నారు.

9 నుంచి సీఐటీయూ రాష్ట్ర సమావేశాలు

పెనుగొండ, డిసెంబరు 30 : తాడేపల్లిగూడెంలో జనవరి 9,10,11 తేదీల్లో  జరిగే సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘ నాయకుడు ఎం.ఆంజనేయులు అన్నారు.  పెనుగొండ గ్రామ పంచాయతీ కార్మికుల బోజన విరామ సమయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు, పీఎఫ్‌,ఈఎస్‌ఐ, వైఎస్‌ఆర్‌ బీమా పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయు నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-31T05:23:45+05:30 IST