బాలలను కార్మికులుగా మార్చడం నేరం :సీఐ
ABN , First Publish Date - 2021-05-21T05:25:13+05:30 IST
బాలలను కార్మికులుగా మార్చడం నేరమని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేఏ స్వామి అన్నారు.

నిడదవోలు/తాడేపల్లిగూడెం రూరల్, మే 20 : బాలలను కార్మికులుగా మార్చడం నేరమని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేఏ స్వామి అన్నారు. గురువారం నిడదవోలు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా ఎస్పీ కె.నారాయణ్ నాయక్ ఆదేశాల మేరకు ముస్కాన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గుర్తించిన వీధి బాలకార్మికుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలలకు కరోనా టెస్టులు నిర్వహించి మా స్కులు, స్వీట్స్, ఫ్రూట్స్, బ్రెడ్లు అందజేశారు. ఎస్‌ఐ జగదీశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఇన్‌స్పెక్టర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో..
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో టీ విక్రయి స్తున్న బాలిక లలితకుమారిని ఐసీడీఎస్ అఽధికారులు గుర్తించి తణుకు బాల సదన్‌కు తరలించారు. బాలికను తల్లిదండ్రులు వదిలేయడంతో మేన మామ వద్దకు చేరి టీ అమ్ముతుండగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీహెచ్ దుర్గాభవాని, విశాలాక్ష్మి గుర్తించి పోలీస్ స్టేషన్ వద్ద మేనమామకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికకు కరోనా పరీక్షలు నిర్వహించి తణుకు బాలసదన్‌కు తరలించారు. జీఎంఎస్‌కే భవాని, అంగన్‌వాడీ కార్యకర్త దుర్గ పాల్గొన్నారు.