క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదం

ABN , First Publish Date - 2021-12-26T05:14:01+05:30 IST

క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడు తున్నాయని మంత్రి తానేటి వనిత అన్నారు.

క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదం
పైడిపర్రు చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న మంత్రి వనిత

తణుకు, డిసెంబరు 25: క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడు తున్నాయని మంత్రి తానేటి వనిత అన్నారు. పైడిపర్రులోని చర్చిలో శనివారం  జరిగిన ప్రార్థనలో పాల్గొని మాట్లాడారు. మీరంతా ఆశీర్వదించడం వల్ల జగ నన్న సీఎం అయ్యారన్నారు. కార్యక్రమంలో పాస్టర్‌ జాషువా జుడే తదితరులు పాల్గొన్నారు. ఇవాంజలికల్‌ చర్చిలో టీడీపీ నాయకురాలు వావిలాల సరళాదేవి క్రిస్మస్‌ వేడుకల్లో ప్రసంగించారు. కార్యక్రమంలో పాదర్‌ జోసస్‌ మురారీ తదితరులు పాల్గొన్నారు. ఆరవ వార్డులోని యానాదులు సంఘం అధ్యక్షుడు పసుపులేటి చిన్నయ్య ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ వేడుకల్లో టీడీపీ నాయకులు బసవా రామకృష్ణ, తమరాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-12-26T05:14:01+05:30 IST