రక్షకుడు ఉదయించినాడు..
ABN , First Publish Date - 2021-12-26T05:41:27+05:30 IST
హ్యాపీ క్రిస్మస్.. మెర్రీ క్రిస్మస్.. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ అంటూ.. ఊరూవాడా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు
హ్యాపీ క్రిస్మస్.. మెర్రీ క్రిస్మస్.. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ అంటూ.. ఊరూవాడా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చర్చిల వద్ద శుక్ర వారం రాత్రి నాటకాలతో సండే స్కూల్ చిన్నారులు అలరించారు. శనివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశ్వాసులు రక్షకుడు ఉదయించి నాడట.. మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడు.. త్వరగా రానున్న ఏసు త్వరగానే రమ్ము తండ్రి అంటూ ప్రత్యేక గీతాలు ఆల పించారు.. పాస్టర్లు క్రిస్మస్ విశిష్టతను తెలియజేశారు.పలు చర్చిలలో కేక్‌లు కట్ చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. చర్చిలు విద్యుద్దీపాలంకరణలో కళకళలాడాయి.
ఆకివీడు : ఆకివీడు కల్వరి బాప్టిస్ట్ చర్చిలో శనివారం ఎమ్మెల్యే మంతెన రామరాజు, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు కేక్ కట్ చేశారు. పెదపేట ఆంధ్రాటౌన్, సెంట్రల్, ఉల్వర్థన్‌పేట యునైటెడ్, ఎల్‌ఈఎఫ్, వారపుసంత గాస్పెల్ బాప్టిస్ట్,మాదివాడ సీబీసీఎన్‌సీ, మేరీమాత ఆర్‌సీఎం, బైపాస్‌రోడ్డు ఇమ్మాన్యుయేల్ ప్రార్థనా మందిరం, జవహర్‌పేట విశ్వాసుల ప్రార్థన సహావాసం, గాంధీనగర్ ఎయిమ్ మినిస్ట్రీస్ చర్చిలలో ప్రార్థనలు చేశారు.
యలమంచిలి : క్రిస్మస్ పర్వదినాన్ని మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. యలమంచిలి, ఆర్యపేట, కొంతేరు, చించినాడ, మట్లపాలెం, దొడ్డిపట్ల, కనకాయలంక తదితర గ్రామాల్లోని చర్చిల్లో వేకువజామున మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయు. మతప్రభోధకులు శాంతి సందేశాన్ని అందించారు. కనకాయలంకలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు.
నరసాపురం టౌన్ : తీరంలో శనివారం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థనామందిరాల్లో చిన్నారులు చేసిన డ్యాన్స్‌లు అలరించాయి.పట్టణ, మండలంలోని అన్ని ప్రధాన చర్చిలు విశ్వాసు లతో కిటకిటలాడాయి. పట్టణంలోని లూథరన్, బేతస్థ, జీడీఎం, జీవనజ్యోతి, మిషన్‌స్కూల్ రోడ్‌లోని అంథుల పాఠశాల చర్చి, పెంతుకోస్తు, స్టేషన్‌పేట, బొజ్జమ్మ చర్చిలలో క్రిస్మస్ సందేశాలను వినిపించారు.లూథరన్ చర్చిలో వేడుక కు ఎమ్మెల్యే ప్రసాదరాజు హాజరయ్యారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బం డారు నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
పాలకొల్లు అర్బన్ : పట్టణంలోని పలు చర్చిల్లో క్రైస్తవ సోదరులు పండు గను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. లాకుల వద్ద, క్రిస్టియన్ పేట, బెత్లహం పేట, శంభునిపేట చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైసీపీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ కేక్ కట్ చేసి శుభాకంక్షలు తెలిపారు. పాలకొల్లు మండల గ్రామాల్లో వేడుకగా క్రిస్మస్‌పండుగ చేసుకు న్నారు.నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఐదో వార్డులో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ తాత, శాంతా క్లాజ్, క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులకు బహు మతులు అందించారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి క్రిస్మస్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
మొగల్తూరు : మండలంలో క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వ హించారు. మొగల్తూరు లూథరన్ ప్యారిష్ చర్చిలు పాలపర్తివారిపేట, కొండా వారిపాలెం, కొత్తపాలెం, శేరేపాలెం, ఇంజేటివారిపాలెం, నక్కావారిపాలెం గ్రామా ల్లోని చర్చిల్లో వేడుకలు నిర్వహించారు. కొత్తపాలెంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ప్రసాదరాజు క్రిస్మస్ కేక్ కట్ చేశారు. మొగ ల్తూరు సర్పంచ్ పడవల మేరీసత్యనారాయణ నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
ఆచంట : క్రిస్మస్ పండుగను శనివారం క్రైస్తవ సోదరులు వేడుకగా నిర్వహించారు. ఉదయం నుంచి చర్చిలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మండలంలో క్రిస్మస్ శోభ నెలకొంది.
పెనుగొండ : క్రిస్మస్ వేడుకలను మండలంలో క్రైస్తవ సోదరులు ఘనం గా నిర్వహించారు. ఉదయం నుంచి చర్చిలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడా యి. అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
భీమవరం/టౌన్ : పట్టణంలోని క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రూపాంతర దేవాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు(చినబాబు), టీడీపీ సీనియర్ నాయకుడు మెంటే పార్థసారథి, ఫినేహర్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుబాకాంక్షలు తెలిపారు. సెంట్ పీటర్స్ లూఽథరన్ దేవాలయం, లూథరన్ దేవాలయం, ఆర్‌సీఎం చర్చి, మోయర్ మొమోరియల్ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భీమవరం బేతని లూథరన్ చర్చిలో పాస్టర్ టి.జాన్ ప్రకాష్, గంటా సుందర కుమార్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఆదిత్య కళాశాలలో క్రిస్మస్ నిర్వహించారు. రాయలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు క్రిస్మస్ నిర్వహించారు.
ఉండి : ఎన్‌ఆర్‌పిఅగ్రహారం ట్రినిటి లూథరన్ చర్చిలో క్రిస్మస్‌ను భక్తీ శ్రద్ధలతో జరిపారు. పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మహిళలు, చిన్నారులు చక్కిని పాటలను ఆలపించారు. యండగండి, ఉండి, చెరుకువాడ, మహదేవపట్నం, కోలమూరు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు యండగండిలో క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. ఎమ్మెల్యే రామరాజు,గోకరాజు రామరాజు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
వీరవాసరం : మండల గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ఆయా క్రైస్తవ దేవాలయాల్లో మత ప్రబోధకులు క్రీస్తు జననాన్ని తెలియచేస్తూ సందేశాలు ఇచ్చారు. లూఽథ రన్, ఆర్‌సీఎం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
పోడూరు : మండలంలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున చిన్నారులు,విశ్వాసులు, పాస్టర్లు వీధుల్లో సువార్త దండయా త్రలు చేశారు. ఉదయం నుంచి ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించా రు. జిన్నూ రు, పోడూరు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ గుంటూరి పెద్ది రాజును పాస్టర్లు, సంఘపెద్దలు సన్మానించారు.మట్టపర్రు చిన్నపాలెంలో పెచ్చెట్టి గాడ్స్‌విల్, జ్యోతి దంపతులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
