వశిష్ఠ వారధి.. సమస్యల తీరిది!
ABN , First Publish Date - 2021-08-09T04:46:49+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానిస్తూ చించినాడ – దిండి గ్రామాల మధ్య ఉన్న వశిష్ఠ వారధి నిర్వహణ కరువై అధ్వా నంగా మారింది.
అధ్వానంగా చించినాడ బ్రిడ్జి
యలమంచిలి, ఆగస్టు 8 : ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానిస్తూ చించినాడ – దిండి గ్రామాల మధ్య ఉన్న వశిష్ఠ వారధి నిర్వహణ కరువై అధ్వా నంగా మారింది. జాతీయ రహదారి కావడంతో బ్రిడ్జిపై నిత్యం వేలాది వాహ నాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయినా బ్రిడ్జిని కనీసం పట్టించుకునేవారే కరువయ్యారు. బ్రిడ్జిపై చాలా చోట్ల పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయి. అంతే కాకుండా గోతుల్లో ఇనుపచువ్వలు పైకితేలి ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమ యాల్లోనూ, వర్షం పడినపుడు నీరు గోతుల్లో చేరి ప్రమాదాల బారిన పడు తున్నారు. చించినాడ వైపున అప్రోచ్ రోడ్డు అనంతరం సుమారు 50 మీటర్ల మేర రహదారి చిధ్రమవడంతో వాహనదారులు అవస్థలు పడుతు న్నారు. ఆ దారిలో ఎలా వెళ్లాలో తెలియక గోతుల్లో పడుతూ.. తేలుతూ వెళుతున్నారు. చాలా కాలంగా పరిస్థితి ఇలా ఉన్నా కనీసం పట్టించుకున్నవారే కానరావడం లేదు. ఇక రాత్రి సమయాల్లో ఎక్కడ గొయ్యిందో.. ఎక్కడ రోడ్డుందో తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు.ఫుట్‌పాత్‌ను అనుకుని చెత్త, మట్టి పేరుకుపో వడంతో వర్షం వస్తే బ్రిడ్జిపై మడుగును తలపించేలా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుద్దీపాలు ఒక్కటి కూడా వెలగడంలేదు. సోలార్ విద్యుద్దీపాలకు ఏర్పాటు చేసిన బ్యాటరీలు చాలా ఏళ్ల కిందట తస్కరణకు గురయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాత్రిళ్లు బ్రిడ్జిపై చిమ్మచీకట్లో రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ రాత్రి సమయంలో వెలుగులు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ మార్గంలో సమస్యలను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.