పిల్లుల అపహరణ.. ముగ్గురిపై కేసు

ABN , First Publish Date - 2021-10-14T05:39:56+05:30 IST

ఏలూరులో 20 పిల్లులను అపహరించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లుల అపహరణ.. ముగ్గురిపై కేసు

ఏలూరు క్రైం, అక్టోబరు 13 : ఏలూరులో 20 పిల్లులను అపహరించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దెందులూరు మండలం నాగులదేవుపాడుకు చెందిన దానం మేరీ రాజమండ్రిలోని ‘యానిమల్‌ లవర్స్‌’ సంస్థ సభ్యురాలు. ఏలూరులో కూరగాయల షాపు నిర్వహిస్తున్నారు. ఆమె రోజూ కుక్కలు, పిల్లులకు ఆహారాన్ని పెడుతుంటారు. ఈ నెల 12న ముగ్గురు వ్యక్తులు రోడ్లపై సుమారు 20 పిల్లులను పట్టుకుని వెళుతుండగా మున్సిపల్‌ ఆఫీసు వద్ద ఆమె వారిని అడ్డగించి వాటిని వదిలి వేయాలని చెప్పారు. ఆమెను తోసేసి వాటిని అపహరించుకుపోవడంతో మేరీ ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.బాలరాజాజీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T05:39:56+05:30 IST