వారే.. అయినవారయ్యారు!

ABN , First Publish Date - 2021-05-19T04:47:32+05:30 IST

ఏమీ కానివారే ఆ సమయానికి అయిన వార య్యారు. అంత్య క్రియలు పూర్తి చేశారు.

వారే.. అయినవారయ్యారు!
మృతదేహాన్ని తరలిస్తున్న విద్యార్థి యువజన సంఘ నాయకులు

అనాథ శవానికి విద్యార్థి యువజన సంఘ నాయకుల అంత్యక్రియలు

భీమవరం, మే 18 : ఏమీ కానివారే ఆ సమయానికి అయిన వార య్యారు. అంత్య క్రియలు పూర్తి చేశారు.  భీమవరం పట్టణంలో ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.  ఈ నేపథ్యంలో బంధువులు, ఇతరులు ఎవరూ అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి, యువజన సంఘ నాయకులు (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు కొండ్రు సూర్య, డీవైఎ ఫ్‌ఐ జిల్లా పూర్వ కార్యదర్శి అల్లూరి అరుణ్‌, కిశోర్‌లు అక్కడికి చేరుకుని పీపీఈ కిట్లు ధరించి మరణించిన వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Updated Date - 2021-05-19T04:47:32+05:30 IST