కారు అద్దెకు తీసుకుని మోసగించారని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-29T05:20:47+05:30 IST

కారును అద్దెకు తీసుకుని వెళ్లి ఇవ్వకుండా మోసగించిన ఇద్దరిపై కేసు నమోదైంది.

కారు అద్దెకు తీసుకుని మోసగించారని ఫిర్యాదు

భీమవరం క్రైమ్‌, నవంబరు 28 : కారును అద్దెకు తీసుకుని వెళ్లి ఇవ్వకుండా మోసగించిన ఇద్దరిపై కేసు నమోదైంది. గునుపూడికి చెందిన రత్నాజీ గత కొంత కాలంగా కార్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 11వ తేదీన ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దెకు కావాలంటూ వచ్చి తీసుకుని వెళ్ళారు. అయితే అప్పటి నుంచి కారును తిరిగివ్వలేదు.ఆ ఇద్దరు వ్యక్తులు ఆదివారం బస్టాండ్‌ సమీపంలో కనిపించడంతో కారు ఎక్కడ ఉందని అడిగితే ఎప్పుడో అమ్మేశామని చెప్పారు.బాధితుడు రత్నాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ కృష్ణభగవాన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-29T05:20:47+05:30 IST