కాలినడక భక్తుల నుంచి దోపిడీ

ABN , First Publish Date - 2021-11-28T05:39:04+05:30 IST

ద్వారకా తిరుమల దర్శనానికి వెళ్తున్న మహిళా భక్తులను అడ్డగించి వారి బంగారు వస్తువులు దోచుకుపోయిన ఘటన తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

కాలినడక భక్తుల నుంచి దోపిడీ

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు  27: ద్వారకా తిరుమల దర్శనానికి వెళ్తున్న మహిళా భక్తులను అడ్డగించి వారి బంగారు వస్తువులు దోచుకుపోయిన ఘటన తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.  పోలీసుల  వివరాల ప్రకారం  తాడేపల్లిగూడెం మండలం కొత్తూరుకు చెందిన 11 మంది మహిళా భక్తులు కాలినడకన ద్వారకాతిరుమల బయలుదేరారు. పెదతాడేపల్లి జాతీయ రహదారి వద్ద ముగ్గురు దుండగులు కారుపై వచ్చి వారి మెడలోని మూడున్నర కాసుల బంగారు వస్తువులు లాక్కుని కారులో ఉడాయించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-28T05:39:04+05:30 IST