విదేశీ విద్య ఉపకార వేతనాలు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-09-03T05:38:44+05:30 IST

గత ప్రభుత్వం బకాయిలు ఉన్న విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కమృద్దీన్‌ డిమాండ్‌ చేశారు.

విదేశీ విద్య ఉపకార వేతనాలు విడుదల చేయాలి

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 2 : గత ప్రభుత్వం బకాయిలు ఉన్న విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కమృద్దీన్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద గురువారం బీజేపీ మైనార్టీ మోర్చ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 శాతం ముస్లిం, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముస్లిం, మైనార్టీల పట్ల ఉద్దేశ్యపూర్వకంగా వివక్ష చూపుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా బకాయిలు చెల్లిం చ కుండా ఇతర వర్గాలకు వేసి ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తు న్నారని తక్షణమే ఉపకార వేతనాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపా ధ్యక్షుడు దిడ్ల ఆంజిలో, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఎన్‌. కృష్ణచైతన్య శర్మ, నాయకులు బాడిత నారాయణరావు, శీర్ల భాస్కర్‌, సతీష్‌కుమార్‌, నాగ సురేష్‌, ఎం.కృష్ణదేవరాయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T05:38:44+05:30 IST