భీమవరం డీఎన్నార్లో నేడు రిక్రూట్మెంట్ డ్రైవ్
ABN , First Publish Date - 2021-04-17T05:17:54+05:30 IST
డీఎన్నార్ కళాశాలలో శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు.
భీమవరం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 16 : డీఎన్నార్ కళాశాలలో శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. హెటెరో డ్రగ్స్, మెడ్ ప్లస్ మొదలగు కంపెనీలలో అర్హత కలిగిన వారికి ఉద్యోగ నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రిన్సిపాల్ శాంతకుమారి మాట్లాడుతూ ఎమ్మెస్సీ ఆర్గానిక్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీ.కామ్, బీఏ 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు అర్హులన్నారు. ఇం టర్వ్యూకు బయోడేటా, ఆధార్, విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు.