పవన్‌పై భీమవరం ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2021-02-26T19:42:04+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు.

పవన్‌పై భీమవరం ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. వీరవాసరం మండలం మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారన్నారు. జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడి జరిగిందని తెలిసి వెళ్లిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరపించారు. పవన్ కళ్యాణ్ మెడ మీద తలకాయలు ఉండవ్ అని హెచ్చరించారు. వాళ్ళ కార్యకర్తలకు దిశా నిర్దేశం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతో ఛలో మత్స్యపురికి పిలుపునిస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. 

Updated Date - 2021-02-26T19:42:04+05:30 IST