భగవద్గీత పోటీల విజేతలకు బహుమతులు
ABN , First Publish Date - 2021-12-15T05:37:59+05:30 IST
రామచంద్రరా వుపేట వేంకటే శ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించిన భగవద్గీత కంఠస్త పోటీల్లోని విజేతలకు మంగళవారం బహుమ తులు, ప్రశంసాపత్రాలు టీటీడీ నిర్వాహకులు అందజే శారు.

ఏలూరు కార్పొ రేషన్, డిసెంబరు 14 : రామచంద్రరా వుపేట వేంకటే శ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించిన భగవద్గీత కంఠస్త పోటీల్లోని విజేతలకు మంగళవారం బహుమ తులు, ప్రశంసాపత్రాలు టీటీడీ నిర్వాహకులు అందజే శారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 700 శ్లోకాల కంఠస్త పోటీల్లో జూనియర్స్ విభాగంలో జి.భువనశ్రీ, సీహెచ్.హర్షశ్రీ ఎంపికయ్యారు. సీనియర్స్ విభాగంలో డి.నాగశిరీష, డి. పుష్పభాను, జి.సునీత ఎంపికయ్యారు. 17వ అధ్యాయం శ్లోక కంఠస్త పోటీల్లో జూనియర్స్ విభాగంలో డి.వారాహి, పి.ఆర్.ఆదర్శకుమార్, పి.సాతృక, సీనియర్స్ విభాగంలో పి.హర్షిత, కె.వైష్ణవి, ఆచంట వైష్ణవి ఎంపికయ్యారు. వీరికి జిల్లా విశిష్ట ధర్మాచార్యులు డాక్టర్ ఎం.వి.ఎస్.సత్యనారాయణ, ఈవో నాగం సన్యాసి రావు, రఘురామ్, ప్రోగ్రాం ఆఫీసర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరరావు అందజేశారు.