క్లోరిన్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-08-22T05:29:53+05:30 IST

క్లోరిన్‌ రసాయనం వినియో గంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేకుంటే పెను ప్రమాదాలు సంభవిస్తాయని ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఆర్‌.త్రినాథరావు తెలిపారు.

క్లోరిన్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి
క్లోరిన్‌ వినియోగంపై సూచనలిస్తున్న త్రినాథరావు

కొవ్వూరు, ఆగస్టు 21: క్లోరిన్‌ రసాయనం వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేకుంటే పెను ప్రమాదాలు సంభవిస్తాయని ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.త్రినాథరావు తెలిపారు. ఆంధ్ర షుగర్స్‌ కర్మాగారం మేనేజర్‌ ఈవీ.కృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన రక్షిత నీటి సరఫరా క్లోరిన్‌ వినియోగదారుల శిక్షణ సదస్సులో త్రినాథరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్లోరిన్‌ ఉప యోగాలు, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్లోరిన్‌ లీక్‌ అయితే భద్రతా పరికరాలు వాడడంపై జాగ్రత్తలను తెలియజేశారు. క్లోరినేషన్‌తో కలరా, టైఫాయిడ్‌, డయేరియా, కామెర్ల వంటి వ్యాధులను నుంచి ప్రజలను కాపాడవచ్చన్నారు. మానవ మనుగడకు ఉపయోగకారి అయినప్పటికి ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం తప్పదన్నారు. క్లోరిన్‌ వినియోగంలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలోని మునిసిపల్‌ పబ్లిక్‌ హెల్త్‌ సిబ్బందికి, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌, సేఫ్టీ ఇన్‌చార్జి కేవీవీ.సత్యనారాయణ మూర్తి క్లోరిన్‌పై అవ గాహన కల్పించారు. కార్యక్రమంలో షుగర్‌ ఫ్యాక్టరీ పీవో సీహెచ్‌ఎస్‌ మహర్షి, ఇంజ నీర్లు కె.హరనాథ్‌గోపాల్‌, అర్షద్‌ ఆలీ, జి.తాతయ్య, ఎం.బాలాజీ, అసిస్టెంట్‌ సేల్స్‌ ఆఫీసర్‌ కె.చిరంజీవిరావు, ఎస్‌ఎస్‌సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T05:29:53+05:30 IST