ఆటో కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

ABN , First Publish Date - 2021-11-29T05:04:36+05:30 IST

ఆటో కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఆటో కార్మిక సంఘం(ఏఐటీయూసీ) కార్యదర్శి పుప్పాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆటో కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
చాటపర్రు సమావేశంలో పాల్గొన్న ఆటో కార్మికులు

ఏలూరు రూరల్‌, నవంబరు 28 :ఆటో కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఆటో కార్మిక సంఘం(ఏఐటీయూసీ) కార్యదర్శి పుప్పాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చాటపర్రులో ఆదివారం ఆటో కార్మికుల సమావేశం అధ్యక్షు డు బొడ్డు సురేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై నెలలుగా కొవిడ్‌ వల్ల ఆటోలకు కిరాయిలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగేలా పీఎఫ్‌, ఈఎస్‌ఐలతో కూడిన సమగ్ర చట్టం చేయాలని కోరారు. పెట్రోలు, డీజిల్‌ ఽధరలు పెరగడంతో ఆటోలు నడపడం భారంగా మారిందని వాటిపై వ్యాట్‌ తగ్గించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 101 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ కార్మిక వర్గానికి 44 చట్టాలను సాధించి పెట్టిందన్నారు. కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, ఎన్‌.దుర్గారావు, బి.లక్ష్మణరావు, జి.పోతురాజు, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T05:04:36+05:30 IST