‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ మహిళలకు వరం

ABN , First Publish Date - 2021-10-08T04:35:43+05:30 IST

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మహిళలకు వరంలాంటిదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ మహిళలకు వరం
మహిళలకు చెక్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే

బుట్టాయగూడెం, అక్టోబరు 7: వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మహిళలకు వరంలాంటిదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని 887 సంఘాల సభ్యులకు రూ. 5,34,82,336 చెక్కులను గురువారం ఆయన పంపిణీ చేశారు. ఆసరా పథకం డబ్బులతో మహిళలు స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఎంపీపీ కారం శాంతి, జడ్పీ టీసీ మొడియం రామతులసీ, ఎంపిడివో ఎం.రాజు, ఆరేటి సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T04:35:43+05:30 IST