అంతా వాళ్లిష్టం!

ABN , First Publish Date - 2021-12-30T05:44:39+05:30 IST

అంతా మా ఇష్టం.. అడిగేదెవడ్రా మా ఇష్టం అంటున్నారు.. ఆక్వా రైతాంగం.. నిబంధనలు లేవు..

అంతా వాళ్లిష్టం!
అనధికార తూరలను చూపుతున్న రైతు

జీఅండ్‌వీ కెనాల్‌లో అనధికార తూరలు


పాలకోడేరు, డిసెంబరు 29 : అంతా మా ఇష్టం.. అడిగేదెవడ్రా మా ఇష్టం అంటున్నారు.. ఆక్వా రైతాంగం.. నిబంధనలు లేవు.. ఆంక్షలు లేవు.. హద్దులు దాటి అక్రమాలకు పాల్పడు తున్నారు. అయినా పట్టించుకునే అధికా రులే కానరావడంలేదు.. వేండ్ర గ్రామంలో  జీఅండ్‌వీ కెనాల్‌ను ఆనుకొని సుమారు  వంద ఎకరాలకు పైగా వరి సాగుచేస్తున్నారు. ఈ వరి పొలాలను చేర్చి వందలాది ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ చెరువుల్లోకి నీరును పెట్టుకునేందుకు జీఎండ్‌వీ కెనాల్‌ నుంచి అనధికార తూములను ఏర్పాటు చేసుకుని అవసరమైనప్పుడు నీటిని తోడుకుంటున్నారు. ఈ అనధికార తూముల వల్ల  దిగువన ఉన్న రైతాంగం నీరందక ఇబ్బందులు పడుతున్నారు. అనధికార తూములను తీయించాలని మొర పెట్టుకుంటున్నా ఎవరు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ ఏఈ వినయ్‌కుమార్‌ను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా తన దృష్టికి రాలేదని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-12-30T05:44:39+05:30 IST