ఉర్దూ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేయండి

ABN , First Publish Date - 2021-09-04T05:08:43+05:30 IST

దూబచర్ల డైట్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ అధ్యాపకుల పోస్టులను అర్హులైన జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులతో డిప్యుటేషన్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు నిర్ణయించినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

ఉర్దూ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేయండి

  ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 3 : దూబచర్ల  డైట్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ అధ్యాపకుల పోస్టులను అర్హులైన జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులతో డిప్యుటేషన్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు నిర్ణయించినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. అర్హులు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులను డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు స్వయంగా, లేదా పోస్టు ద్వారా అందజేయవచ్చన్నారు. దరఖాస్తు, అర్హతలు, పోస్టు వివరాలకు deowg.org వెబ్‌సెట్‌ నుంచి పొందాలని, మరిన్ని వివరాలకు ఫోన్‌ నెంబర్‌ 95022 06831లో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2021-09-04T05:08:43+05:30 IST