ఏపీఈఏపీ సెట్ ప్రశాంతం
ABN , First Publish Date - 2021-09-04T05:01:06+05:30 IST
ఏపీఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మశీ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది.

భీమవరం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 3 : ఏపీఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మశీ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 2195 మంది విద్యార్థులకు గాను 2050 మంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్ష జరిగింది. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌లో 397 మంది, నరసాపురం స్వర్ణాంధ్రలో 259 మంది, తాడేపల్లిగూడెం వాసవిలో 559 మంది, ఏలూరు సీఆర్‌ఆర్‌లో 210 మంది, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 312 మంది, శ్రీ విద్యాలయలో 313 మంది హాజరు కాగా కొవిడ్ నిబంధనలతో పరీక్ష నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.